దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు మరోమారు పెరిగాయి. ఆది, సోమవారాల్లో ఎలాంటి పెరుగుదల లేకపోగా.. మంగళవారం మళ్లీ చమురు సంస్థలు ధరలు పెంచాయి. పెట్రోలుపై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసల పెరిగాయి. హైదరాబాద్‌లో ఇవాళ లీటరు పెట్రోలు ధర 94రూపాయల 54పైసలు, డీజిల్ ధర 88రూపాయల 69పైసలకు చేరింది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.94.54 - హైదరాబాద్ తాజా వార్తలు
వరసగా పెరుగుతూ వస్తున్న చమురు ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్‌లో ఇవాళ లీటరు పెట్రోలు ధర 94రూపాయల 54పైసలు, డీజిల్ ధర 88రూపాయల 69పైసలకు చేరింది.
PETROL
ఈ నెల ఒకటో తేదీ ధరలతో పోలిస్తే హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్‌పై సుమారు 5 రుపాయలు పెరిగింది. ఈ నెల ఒకటిన పెట్రోల్ ధర 89 రూపాయల 77పైసలు, డీజిల్ ధర 83రూపాయల 46పైసలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులను దృష్ట్యా.. ప్రస్తుతం రోజువారీగా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తున్నాయి.