ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 6, 2020, 3:31 PM IST

Updated : Nov 6, 2020, 6:05 PM IST

ETV Bharat / city

సీఎం జగన్‌ లేఖ అంశంలో దాఖలైన పిటిషన్లపై 16న 'సుప్రీం' విచారణ

cm jagan
cm jagan

15:27 November 06

జగన్ లేఖ వివాదంపై 16న విచారణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ ‌రెడ్డి లేఖ రాయడం, దానిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజేయకల్లం బహిర్గతం చేయడంపై సుప్రీం కోర్టులో దాఖలైన మూడు పిటిషన్లు ఈనెల 16న విచారణకు రానున్నాయి. జడ్డిలపై ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మీడియా సమావేశం నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ పిటిషన్‌ వేశారు. న్యాయస్థానాలపై భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేయకుండా ప్రతివాదిపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. సీఎం జగన్​కు షోకాజు నోటీసులు ఇవ్వాలని పిటిషన్‌లో సునీల్ కుమార్ సింగ్ కోరారు. 

న్యాయమూర్తులపై నిరాధార ఆరోపణలు చేసిన జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ మరో పిటిషన్‌ వేశారు. వ్యక్తిగత ప్రయోజానాల కోసం ముఖ్యమంత్రి పదవికి అపకీర్తి తెస్తూ బహిరంగంగా నిరాధార ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. సీజేఐకు రాసిన లేఖను బహిర్గతం చేసిన జగన్, ఆయన సలహాదారుపై చర్యలు తీసుకోవాలని యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ మరో పిటిషన్‌ వేసింది. వీటిని ఈ నెల 16న జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ రవీంద్ర భట్‌తో కూడిన ధర్మాసనం విచారించనుంది.

ఇదీ చదవండి

'లేఖ' వివాదం: ఏజీకి అశ్వినీ కుమార్ మరో ఉత్తరం

Last Updated : Nov 6, 2020, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details