ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మిషన్ బిల్డ్ ఏపీపై తదుపరి విచారణ ఈ నెల 26కి వాయిదా - మిషన్ బిల్డే ఏపీపై వార్తలు

మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో వ్యాఖ్యం దాఖలైంది. ప్రభుత్వ భూములే కాకుండా.. దాతలు ఇచ్చిన స్థలాలూ అమ్మడం సరికాదని దానిలో దానిలో పేర్కొన్నారు. మంగళవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కి హైకోర్టు వాయిదా వేసింది.

PETITION ON MISSION BUILD AP IN HIGH COURT
మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ

By

Published : May 22, 2020, 2:33 PM IST

ప్రభుత్వ భూముల అమ్మకాలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్​పై విచారణ జరిగింది. సామాజిక కార్యకర్త సురేశ్ దీనిపై వ్యాజ్యం దాఖలు చేశారు. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములు అమ్మేందుకు ఏపీ సర్కార్ సిద్దమవుతుందని.. వాటిలో దాతలు ఇచ్చినవీ ఉన్నాయని దానిలో పేర్కొన్నారు. వాటిని సైతం విక్రయించడం సరికాదని పిటిషనర్ తరుపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం తరుఫున న్యాయవాది దీనిపై వివరణ ఇచ్చేందుకు సమయం కోరారు. మంగళవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కి హైకోర్టు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details