ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యాయ విద్యలో వయోపరిమితిపై పిటిషన్ - law course in ap latest news

న్యాయ విద్యలో వయోపరిమితిపై కాంపిటిషన్ కమిషన్​లో విజయవాడకు చెందిన వ్యక్తి పిటిషన్ వేశారు. రెండు నెలల్లో కమిషన్ నిర్ణయం వెల్లడించే అవకాశముందని రవీంద్రబాబు తెలిపారు.

petition on age limit in law course
టి .రవీంద్రబాబు

By

Published : Dec 1, 2020, 1:46 PM IST

న్యాయ విద్యను అభ్యసించేవారికి వయోపరిమితి విధించటంపై విజయవాడకు చెందిన టి. రవీంద్రబాబు కాంపిటిషన్ కమిషన్​లో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయశాస్త్ర విద్యను అభ్యసించే అభ్యర్థికి 30 ఏళ్ల కంటే మించి ఉండకూడదన్న నిబంధనను.. 2009లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అమలు చేయాలని నిర్ణయించింది. ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటమేనంటూ కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

బీసీఐ తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు ఆ సందర్భంలో.. స్టే విధించింది. ఇప్పటికీ విచారణ ఇంకా జరుగుతోంది. ఈ సమస్యకు నిర్ణీత సమయంలో పరిష్కారం లభించాలనే ఉద్దేశంతో కాంపిటిషన్ కమిషన్​లో పిటిషన్ దాఖలు చేసినట్లు రవీంద్రబాబు తెలిపారు. రెండు నెలల సమయంలో కమిషన్ నిర్ణయం తెలిపే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details