కుల ధ్రువీకరణ పత్రాలపై సీఎం బొమ్మ ముద్రణపై హైకోర్టులో పిటిషన్ - కుల ధ్రువీకరణ పత్రంపై సీఎం జగన్ ఫొటో
11:48 September 30
ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలపై సీఎం బొమ్మ ముద్రణపై హైకోర్టులో పిటిషన్
ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలపై సీఎం బొమ్మ ముద్రణపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ధ్రువీకరణ పత్రాలపై సీఎం బొమ్మ ముద్రణ చట్టవిరుద్ధమని గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన జడ రవీంద్రబాబు పిటిషన్ వేశారు. రాజకీయ నాయకుల ఫొటోల ముద్రణ సుప్రీం తీర్పునకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.
పిటిషనర్ అభ్యంతరాలను అధికారులకు తెలియజేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరాలు వారంలో రాతపూర్వకంగా తెలియజేయాలని పేర్కొంది. సీఎం బొమ్మ ముద్రణపై 6 వారాల్లో అధికారులు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
ఇదీ చదవండి: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం