ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచాయతీల నిధుల మళ్లింపుపై.. హైకోర్టులో పిటిషన్​ - ap high court news

రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. ఈ మేరకు పంచాయతీల నిధుల మళ్లింపుపై ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ పిటిషన్​ వేశారు.

హైకోర్టు
హైకోర్టు

By

Published : May 5, 2022, 6:24 PM IST

పంచాయతీల నిధుల మళ్లింపుపై రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. ఈ మేరకు ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ పిటిషన్​ వేశారు. ప్రభుత్వం సర్పంచులకు తెలియకుండా రూ.7,660 కోట్లు కాజేసిందని పిటిషన్​లో పేర్కొన్నారు. సర్పంచుల సంతకాలు లేకుండా పంచాయతీ ఖాతాలను ఖాళీ చేసిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన నిధులపై హైకోర్టులో రెండు పిటిషన్లు వేశాం. హైకోర్టు మాకు న్యాయం చేస్తుందని భావిస్తున్నాం. నిధుల మళ్లింపుపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉద్ధృతం చేయడానికి సర్పంచులం సిద్ధమౌతున్నాం.- వైవీబీ రాజేంద్రప్రసాద్, ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు

పంచాయతీ ఖాతాలు ఖాళీ: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఖాతాల్లోని సాధారణ నిధులు (జనరల్‌ ఫండ్‌) ఖాళీ అయ్యాయి. అత్యధిక పంచాయతీల్లో ఇదే పరిస్థితి తలెత్తడంతో సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఇప్పటికే మళ్లించడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఆస్తి పన్ను, ఇతరత్రా రుసుముల కింద వచ్చే సాధారణ నిధులనూ ఇప్పుడు మళ్లించడంతో సర్పంచులు మరింత రగిలిపోతున్నారు. ప్రస్తుతం చాలా పంచాయతీల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోర్లు మరమ్మతులు చేయించాలన్నా, పాడైన పైపులైన్లు సరి చేయాలన్నా సాధారణ నిధులే పంచాయతీలకు ప్రస్తుతం ఆధారమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిధులు మళ్లిస్తే సమస్యలెలా పరిష్కరిస్తామని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి:'ఆ నిధులను సర్పంచుల ఖాతాల్లో జమ చేయాలి.. లేదంటే కోర్టును ఆశ్రయిస్తాం'

ABOUT THE AUTHOR

...view details