ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బిల్లులు తిరిగి ప్రవేశపెట్టడంపై సుప్రీంలో పిటిషన్

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను శాసనసభలో తిరిగి ప్రవేశపెట్టడంపై తెదేపా ఎమ్మెల్సీ దీపక్​ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సెలక్ట్ కమిటీ పంపిన బిల్లులను మళ్లీ సభలో పెట్టడం సరికాదని పిటిషన్​ పేర్కొన్నారు. కరోనా కారణంగా వ్యాజ్యంపై హైకోర్టు విచారించే ఆస్కారంలేకపోవడంతో సుప్రీంను ఆశ్రయించినట్లు తెలిపారు.

బిల్లులు తిరిగి ప్రవేశపెట్టడంపై సుప్రీంలో పిటిషన్
బిల్లులు తిరిగి ప్రవేశపెట్టడంపై సుప్రీంలో పిటిషన్

By

Published : Jul 11, 2020, 6:01 AM IST

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను శాసనసభలో తిరిగి ప్రవేశపెట్టడాన్ని సవాలు చేస్తూ తెలుగుదేశం ఎమ్మెల్సీ జి. దీపక్‌రెడ్డి శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి ఈ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించకుండానే ఆమోదించారని వివరించారు. తర్వాత వాటిని శాసనమండలికి పంపగా ఛైర్మన్‌ తన అధికారాన్ని ఉపయోగించి సెలక్ట్‌ కమిటీకి సిఫార్సు చేసి సభను వాయిదా వేశారని తెలిపారు.

ఈ క్రమంలోనే జూన్‌ 16న తిరిగి పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను శాసనసభలో మళ్లీ ప్రవేశపెట్టి ఆమోదింపజేశారని పేర్కొన్నారు. ఓ సారి సెలక్ట్‌ కమిటీకి పంపాక మళ్లీ బిల్లులను ప్రవేశపెట్టడం సరికాదని తెలిపారు. కరోనా కారణంగా ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారించే పరిస్థితి లేకపోవడంతో సుప్రీంను ఆశ్రయించినట్లు వివరించారు.

ఇదీ చదవండి :అటవీ భూములపై సాగుహక్కు కల్పించండి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details