ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అది ప్రభుత్వ నిర్ణయం కాదు: పేర్ని నాని - 3 capitals issue in ap

రాజధానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ కేవలం ఒక అంచనా మాత్రమే చెప్పారు గాని... అది ప్రభుత్వ నిర్ణయం కాదని పేర్కొన్నారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఈ వ్యాఖ్యలు చేశారు.

perni nani on jagan comments
అది ప్రభుత్వ నిర్ణయం కాదు: పేర్ని నాని

By

Published : Dec 27, 2019, 5:58 PM IST

అది ప్రభుత్వ నిర్ణయం కాదు: పేర్ని నాని

మూడు రాజధానులపై సీఎం జగన్‌ అసెంబ్లీలో ప్రకటన చేయలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. 3 రాజధానులుంటే ఎలా ఉంటుందనే దానిపైనే సీఎం మాట్లాడారని వివరించారు. ఆవేదనలో అన్న మాటలను పరిగణనలోకి తీసుకుంటామా..? అని ప్రశ్నించారు. 2 కమిటీల నివేదికలు వచ్చాక రాజధానిపై మార్గనిర్దేశం చేసుకుంటామన్న పేర్ని నాని... రాష్ట్రంలో ఎవరు ఆందోళన చేసినా ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాకముందే హడావిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 కమిటీల నివేదికలనూ హైపవర్‌ కమిటీ సమీక్షిస్తుందని... ఆ తర్వాత వాటిపై అసెంబ్లీలో చర్చించాలా లేదా అనేది నిర్ణయిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details