'చంద్రబాబుకు అమరావతిలో పర్యటించే నైతిక అర్హత ఉందా..?' ప్రతిపక్ష నేత చంద్రబాబు అమరావతి పర్యటనను అడ్డుకునేంత కుసంస్కారం... రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అమరావతిలో పర్యటించే నైతిక అర్హత ఉందా..? అంటూ ప్రశ్నించారు. రహదారులు, భవనాలు, మౌలిక వసతులు లేకుండా రాజధాని ఎలా అవుతుందని పేర్ని నాని నిలదీశారు. తమ ప్రభుత్వం వచ్చాకే రాజధాని రైతులకు రూ.108 కోట్ల కౌలు చెల్లించామని వివరించారు.