తెదేపాపై మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ధర్మపోరాట దీక్షల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని మంత్రి ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగుదేశం... భాజపాతో కలిసి డ్రామా ఆడిందని విమర్శించారు. అమరావతిని చంద్రబాబు బంగారు బాతు అనడంపై పేర్ని నాని మండిపడ్డారు. అమరావతిలో సౌకర్యాలపై స్వయంగా కోర్టు ప్రశ్నలు సంధిస్తోందని... దానిపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టిన పవన్‌కల్యాణ్ హోదా సహా రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై ఎందుకు ప్రశ్నించటం లేదని నిలదీశారు.
'బంగారు బాతు ఐతే... కోర్టు ఎందుకు నిలదీసింది...?' - చంద్రబాబుపై మండిపడ్డ పేర్ని నాని
తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మంత్రి పేర్నినాని మండిపడ్డారు. దీక్షల పేరుతో కోట్ల ప్రజల ధనాన్ని కొల్లగొట్టారని విమర్శించారు. చంద్రబాబు భాజాపాతో కలిసి నాటకాలాడారని ధ్వజమెత్తారు.
చంద్రబాబుపై మండిపడ్డ పేర్ని నాని
Last Updated : Oct 25, 2019, 9:57 PM IST