sarkaruvari paata ticket price: మహేశ్‌బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్, కామెడీ చిత్రం 'సర్కారువారి పాట'. కీర్తి సురేశ్ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అదనంగా రూ.50.. ఎయిర్ కండిషన్ సాధారణ థియేటర్లలో అదనంగా రూ.30 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తెలంగాణలో 'సర్కారువారి పాట' సినిమా టికెట్ ధరలు పెంపు.. ఎంతంటే? - sarkaruvari paata ticket price increase
sarkaruvari paata ticket price: 'సర్కారువారి పాట' సినిమాకు టికెట్ ధర పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 7 రోజులపాటు టికెట్‌పై మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అదనంగా రూ.50 పెంచుకునేందుకు సర్కారు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈనెల 12 నుంచి 7 రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. 'సర్కారువారి పాట' చిత్రం అదనపు షోలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారీ బడ్జెట్ చిత్రాల విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 'సర్కారువారి పాట' సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు, అమెరికాలోనూ ఈ సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు. 223 లొకేషన్లలో 648 షోలను ప్రదర్శించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
ఇవీ చదవండి: