విజయవాడ గ్రామీణం కొత్తూరు తాడేపల్లి గోశాలలో మృతిచెందిన గోమాతల ఆత్మ శాంతి కోరుతూ.. రెండు రోజులపాటు విశ్వశాంతి మహా యజ్ఞం నిర్వహించారు. మొదటిరోజు గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్రంలో పీఠాధిపతి శివ స్వామి ఆధ్వర్యంలో పూజలు చేశారు. రెండోరోజు తమిళనాడు అరుణాచలం అన్నపూర్ణ ఆశ్రమ పీఠాధిపతి శివానందలహరి నేతృత్వంలో గణపతి హోమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు హాజరయ్యారు. శ్రావణ శుక్రవారం రోజున పెద్దసంఖ్యలో గోవులు మృతిచెందడం శ్రేయస్కరం కాదనీ.. అందువల్లే శాంతి కోరుతూ మహాయజ్ఞం చేసినట్లు శివానందలహరి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోశాలలకు, గోవుల మనుగడకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అలాగే గోసంరక్షకులకు తోడ్పాటు అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.
గోమాతల ఆత్మశాంతికి మహాయజ్ఞం నిర్వహణ - మహాయజ్ఞం
తాడేపల్లి గోశాలలో మృతిచెందిన గోవుల ఆత్మశాంతి కోసం మహాయజ్ఞం నిర్వహించారు. పెద్దసంఖ్యలో గోమాతల మరణం రాష్ట్రానికీ, దేశానికీ శ్రేయస్కరం కాదనీ.. అందువల్లే శాంతి హోమం చేశామనీ అన్నపూర్ణ ఆశ్రమ పీఠాధిపతి తెలిపారు.
గోమాతల ఆత్మశాంతికి మహాయజ్ఞం నిర్వహణ