కరోనా మృతదేహాలు తమ ప్రాంతంలో ఖననం చేయోద్దంటూ గ్రామాల్లో అడ్డుకట్టలు వేస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో కరోనా మృతదేహాలను ఖననం చేయడానికి రెవెన్యూ అధికారులు గురువారం స్థలాన్ని గుర్తించారు. స్థానికులు ఈరోజు ఉదయమే అటుగా వెళ్లే దారిలో ముళ్లకంపలు, ట్రాక్టర్‌ను అడ్డుగా పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోనూ కరోనాతో మృతి చెందిన వ్యక్తిని అంత్యక్రియలు చేసేందుకు స్థానికులు అడ్డుకున్నారు. ఎస్ఐ ఏసుబాబు నచ్చజెప్పేందుకు ప్రయత్నించటంతో...వారి మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.
కరోనా మృతదేహాలు ఖననం చేయవద్దంటూ ఆందోళన - చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆందోళనలు
కరోనా మృతదేహాలను తమ గ్రామంలో ఖననం చేయవద్దంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగిన ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని ఎ రంగంపేటలో జరిగింది. మృతదేహాలను తరలించకుండా రోడ్డు మార్గంలో చెట్లను నరికి అడ్డుగా వేశారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
peoples protest at chittoor district over Funeral of corona bodies
TAGGED:
Funeral of corona bodies