తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న కొంతమంది వ్యక్తులకు రెవెన్యూ అధికారులు జరిమానా విధించారు. అకారణంగా బయటకు వచ్చిన వారికి ఫైన్ వేశారు. కొందరు చలానా కట్టగా మరికొందరు రెవిన్యూ అధికారులపై తిరగబడ్డారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించడమే నేరమని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తెలిపారు. అధికారులను ఆక్షేపించిన వారిపై పోలీసులు మండిపడ్డారు. అనంతరం ఆయా వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు.
తెలంగాణ: అకారణంగా తిరిగారు...అడ్డంగా బుక్కయ్యారు - VEHICLES WERE TAKEN BY POLICE
తెలంగాణలోని సంగారెడ్డి పట్టణంలో కొంతమంది వాహనాదారులు మాస్కులు లేకుండా బయట తిరుగుతున్నారని రెవెన్యూ అధికారులు జరిమానా విధించారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు వాహనాలను ఠాణాకు తరలించారు.
సంగారెడ్డిలో పోలీసులు పట్టుకున్న వాహనాలు