అమరావతి కార్పొరేషన్ ఏర్పాటులో భాగంగా జరుగుతున్న గ్రామసభల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 19 గ్రామపంచాయతీలతో కూడిన కార్పొరేషన్‌ను వ్యతిరేకిస్తూ ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. సీఆర్డీఏ పరిధిలోని 29 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటుకు 2020లోనే ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో మూడు రాజధానుల అంశంపై ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం, కరోనా ప్రభావం దృష్ట్యా గ్రామసభలు ఏర్పాటు చేయలేదంటున్నారు. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఏర్పాటు సమయంలో మంగళగిరి మండలంలోని నాలుగు, తాడేపల్లి మండలంలోని రెండు గ్రామాల్లో ప్రజలు సమ్మతించారని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. స్థానికుల అభిప్రాయం మేరకే మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లో కలిపారని, అందుకే ఇప్పుడు మిగిలిన 19 గ్రామాలతో అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు.
AMARAVATI : కార్పొరేషన్ ఏర్పాటుపై గందరగోళం...గ్రామసభల్లో ప్రజల నుంచి వ్యతిరేకత
అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు పేరిట ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. రాజధాని పరిధిలోని 6 గ్రామాలను మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌లో కలిపేందుకు ప్రజలు సమ్మతించారని అధికారులు చెబుతున్నారు. అదే నిజమైతే కోర్టులో కేసులు ఎందుకు వేస్తారని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు. అలాగే రాజధాని అంశం కోర్టులో ఉండగా అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుకు సిద్ధం కావడం, గ్రామసభలు పెట్టడం కోర్టు ధిక్కారమేనని అంటున్నారు.
కార్పొరేషన్ ఏర్పాటుపై గందరగోళంకార్పొరేషన్ ఏర్పాటుపై గందరగోళం
అసత్యాలతో గందరగోళం సృష్టించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఏర్పాటుకు ఆరు గ్రామాల ప్రజలు అంగీకరిస్తే కోర్టులో కేసులు ఎందుకు వేస్తారని ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్ల పేరుతో రాజధాని అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారని మండిపడుతున్నారు. తుళ్లూరు మండలం వెలగపూడి, మల్కాపురం, మందడం గ్రామాల్లో నేడు ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది.
ఇదీచదవండి.