ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పరిశీలన లేకుండా పింఛన్ల రద్దుకు వీల్లేదు: సజ్జల

పరిశీలన లేకుండా పింఛన్లు రద్దు చేయడానికి వీల్లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ జి.శ్రీకాంత్‌రెడ్డిల ఆధ్వర్యంలో అసెంబ్లీ కమిటీ హాలులో ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, సెర్ప్‌ అధికారులతో సజ్జల సమీక్షించారు.

సజ్జల
సజ్జల

By

Published : Sep 16, 2021, 11:32 AM IST

‘ఇంటింటి పరిశీలన, నోటీసులు ఇవ్వకుండా పింఛన్‌ తొలగించడానికి వీల్లేదు’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. పరిశీలనలో ఉన్నవాటిని సంబంధిత లబ్ధిదారుడి అంగీకారం పొందేవరకు రద్దు చేయవద్దని రాష్ట్రస్థాయి సమన్వయ సమావేశంలో నిర్ణయించారు. బుధవారం సజ్జల, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ జి.శ్రీకాంత్‌రెడ్డిల ఆధ్వర్యంలో అసెంబ్లీ కమిటీ హాలులో ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, సెర్ప్‌ అధికారులతో సమీక్షించారు. పలువురు వైకాపా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పింఛన్ల తొలగింపుపై వస్తున్న విమర్శలను ప్రస్తావించారు. కావాలని ఎవరి పింఛన్లనూ తొలగించడం లేదని అధికారులు స్పష్టంచేశారు. ప్రస్తుతం 1.70 లక్షల పింఛన్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఆరు నెలల విద్యుత్తు బిల్లులను పరిగణనలోకి తీసుకొని పింఛన్లు తొలగిస్తున్నారంటూ పలువురు ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. జేసీల లాగిన్‌లలో ఉన్న 2.50 లక్షల పింఛన్లను లబ్ధిదారులకు విడుదల చేయడంలో జాప్యంపై అడిగారు. అర్హులెవరికీ పింఛన్‌ తొలగించరాదన్న సీఎం ఉద్దేశాన్ని అందరూ ఆచరించాలని సజ్జల అధికారులకు సూచించారు. ఈ భేటీ తర్వాత ఎమ్మెల్యేలు విలేకరులతో మాట్లాడారు.

ABOUT THE AUTHOR

...view details