తెలుగు లోగిళ్లలో జరుపుకునే అతి పెద్ద పండుగ.. సంక్రాంతి. చనిపోయిన పూర్వీకులను కూడా గుర్తుచేసుకోవడం ఈ పండుగ పూజల్లో భాగం. నెల్లూరులో... నేరుగా సమాధుల వద్దకే వెళ్లి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారీ బోడిగాడితోటలోని తమ పూర్వీకుల సమాధుల వద్దకు వెళ్లిన స్థానికులు....... వాటిని శుభ్రం చేశారు. పూలతో అలంకరించారు. తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. చనిపోయిన తమ కుటుంబసభ్యులకు...ఇష్టమైన ఆహారం, వస్త్రాలు సమర్పించారు.
పండగంటే గుళ్లు,గోపురాల్లోనే కాదు..శ్మశానంలో కూడా! - పెద్దల పండుగ వార్తలు
పండగంటే గుళ్లు,గోపురాల చుట్టూ తిరుగుతాం.! కానీ అక్కడ సంక్రాంతంటే... శ్మశానంలో గడుపుతారు. కాలంచేసిన కుటుంబీకులను స్మరించుకుంటారు. మరణించినవారికి ఇష్టమైన వంటకాలను వారి సమాధులకు సమర్పిస్తారు.
pedhala-pandug-celebrated-in-nellore-district
ఏటా సంక్రాంతి నాడు పెద్దల పండుగ పేరిట ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని నెల్లూరు ప్రజలు తెలిపారు. రెండ్రోజులు నిర్వహించే ఈ పండుగతో శ్మశానం కాస్త జన సందోహంగా మారిపోయింది.
ఇదీ చదవండి : ఆ జిల్లాల వాళ్లు స్థితిమంతులు: అవంతి