ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపాధి హామీ నిధులతో గ్రామ సచివాలయాల నిర్మాణం..! - కలెక్టర్లతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

ఉపాధిహామీ నిధులతో గ్రామ సచివాలయాల నిర్మాణం చేపట్టాలని  రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిసెంబరు 15లోగా పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు.

peddireddy ramachandrareddy video conference with district collectors
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష

By

Published : Dec 5, 2019, 6:21 PM IST

ఉపాధిహామీ నిధులతో గ్రామ సచివాలయాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాలతో పాటు ఇతర ఉపాధీ హామీ పనులూ ప్రారంభించాలని... పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశంపై సమీక్షించిన మంత్రి... అన్ని పనులకూ డిసెంబరు 15లోగా పరిపాలనా అనుమతులు జారీ చేయాలని సూచించారు.

21వ తేదీ నాటికి క్షేత్రస్థాయిలో మార్కింగ్ నిర్వహించేలా కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో అత్యంత ప్రాధాన్యతాపరంగా అయిదు పనులు చేపట్టాలన్నారు. మొదటి దశలో.. గుర్తించిన గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణం ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలన్నారు. సీసీ రోడ్లతో అనుసంధానించిన డ్రైన్లు, ఉగాది నాటికి అందించే ఇళ్ల స్థలాలకు సంబంధించిన మెరక పనులు చేపట్టాలని సూచించారు.

మనబడి నాడు-నేడు కింద గుర్తించిన పాఠశాలల ప్రహరీగోడల నిర్మాణం చేపట్టాలన్నారు. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న రోడ్ల నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు. జిల్లాల్లో ఉపాధి హామీపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే... సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. పనుల విషయంలో, నాణ్యతలో రాజీ పడొద్దన్నారు. గ్రామీణ నీటిపారుదల విభాగానికి చెందిన ఓవర్ హెడ్ ట్యాంకులకు రంగులు వేయాలని ఆదేశించారు.

సక్రమంగా పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి రూ.15 కోట్లు కేటాయించామని తెలిపారు. ఇసుక విధానంలో భాగంగా చెక్​పోస్ట్​ల విషయంలో కలెక్టర్​లు బాధ్యత వహించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 91 చెక్​పోస్ట్​లు సిద్దమయ్యాయని.. ఇంకా 242 పూర్తికావాల్సి ఉందన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష

ఇవీ చదవండి..

'ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా'

ABOUT THE AUTHOR

...view details