వేరుసెనగతో వేగలేం
అయిదేళ్లలో మూడేళ్లు దెబ్బ.. దిగుబడులు దిగదుడుపే
2016-17 నుంచి అయిదేళ్ల దిగుబడులు పరిశీలిస్తే.. మూడేళ్ల పాటు ఎకరాకు మూడు క్వింటాళ్లలోపే ఉన్నాయి. 2016-17 ఖరీఫ్‌లో ఎకరాకు 168 కిలోలు మాత్రమే వచ్చాయి. గతేడాది కూడా మూడు క్వింటాళ్ల లోపే దక్కింది. 2008-09, 2009-10, 2010-11 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సగటు దిగుబడులు పరిశీలిస్తే.. అనంతపురం జిల్లాలోనే అత్యల్పంగా ఉంది. గుజరాత్‌లో అత్యధికంగా ఎకరాకు 754 కిలోలు.. అత్యల్పంగా 309 కిలోలుగా ఉంది. అనంతపురం జిల్లాలో 129 కిలోలే లభించిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదిక ప్రస్తావించింది.
సాగెందుకు చేయడం లేదంటే..
*15 ఏళ్లుగా నష్టాలే వస్తున్నాయి. పెట్టుబడిలో 10 నుంచి 50 మాత్రమే చేతికొస్తోంది.
*పెట్టుబడులు ఏటా పెరుగుతున్నాయి. గతేడాది ఎకరాకు రూ.18వేల పెట్టుబడి అయితే ఈ ఏడాది రూ.23వేలకు పెరిగింది. ట్రాక్టర్ల బాడుగ, రవాణా, కూలీ రేట్లు, రసాయన ఎరువులు, పురుగుమందుల మీదే రూ.5వేల వరకు పెరిగాయి.
*ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారమూ అందడం లేదు. తెగుళ్లు పెరుగుతున్నాయి.
*గతంలో ఎకరానికి రూ.2వేల వరకు కౌలు ఇచ్చేవారు. ఈ ఏడాది ఉచితంగా ఇస్తామన్నా.. తీసుకునేందుకు ఎవరూ రావడం లేదు.
ఉపాధి కూలీ సొమ్ములే.. పంటకు పెట్టుబడి: అధ్యయన బృందం
*మూడేళ్లుగా రైతులకు రాయితీపై సూక్ష్మసేద్య పరికరాలు ఇవ్వడం లేదు
*ఎంతసేపు వర్షాభావం అని తప్పితే.. దిగుబడులు తగ్గడంపై శాస్త్రీయ పరిశోధనలు చేయడం లేదు.
*కరవు ప్రాంత మెట్ట రైతులకు ప్రత్యేక పథకాలు కొరవడ్డాయి. ఉపాధి హామీ పథకం అనుసంధానించాలని కోరుతున్నా అమలు చేయడం లేదు.
*ఉపాధిహామీ పనికి వెళ్లి.. దానికి వచ్చిన డబ్బుతోనే వేరుసెనగ పంటకు పెట్టుబడులు పెడుతున్నారు