కార్మికుల శ్రమ దేశానికి సంపద అని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప రిమ్స్ లో పనిచేస్తున్న 600 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఉపముఖ్యమంత్రి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు జిల్లా యంత్రాంగం ఎంతగానో కృషి చేస్తోందని కొనియాడారు. రైల్వేకోడూరు. ఓబులవారిపల్లె మండలాల్లో మేడే ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయి. పరిమిత సంఖ్యలో నాయకులు హాజరై, భౌతిక దూరం పాటిస్తూ జెండా ఆవిష్కరించారు.
విశాఖపట్నం జిల్లాలో
ఉపాధి కోల్పోయిన కార్మికులకు ప్రభుత్వం పది వేల రూపాయలు అందించాలని సీ.పీ.ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని నీలం రాజశేఖర్‌రెడ్డి భవనంలో నిర్వహించిన మేడే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం ఎర్రజెండాను ఎగురవేశారు. అనకాపల్లిలో మేడే వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. పట్టణంలోని సీపీఐ కార్యాలయం, ఆర్టీసీ డిపో వద్ద నాయకులు జెండా ఆవిష్కరించారు.
అనంతపురం జిల్లా పెనుకొండలో ...
పెనుకొండ నగరపంచాయతీ కార్యాలయం ఎదుట సీపీఎం నేతలు జెండా ఆవిష్కరించారు. కార్మికుల హక్కుల కోసం పోరాడి చనిపోయిన అమరులకు నివాళులు అర్పించారు.