శాసనమండలి రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేయటాన్ని పీడీఎఫ్ తప్పుబట్టింది. మండలి వల్ల రూ.60కోట్లు వృథా అని సీఎం జగన్, మంత్రులు శాసనసభలో మాట్లాడం సరికాదని పీడీఎఫ్ నేతలు ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ఆ మాత్రం మేథావులు అసెంబ్లీలో ఉన్నారని కించపరచటం సరికాదన్నారు. మండలిలో రాజకీయ నాయకులే కాకుండా... లక్షలాది మంది పట్టభద్రులు, ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా ఎన్నుకున్న ఎమ్మెల్సీలు ఉన్నారని గుర్తుచేశారు. కేవలం వైకాపా అనుకున్న బిల్లులు పాస్ కాలేదన్న కారణంతో మండలిని రద్దు చేస్తారా..? అని ప్రశ్నించారు. మండలి రద్దు విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.
'బిల్లులు పాస్ కాలేదని మండలిని రద్దు చేస్తారా..?' - ఏపీ శాసన మండలి రద్దు వార్తలు
శాసనమండలి రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం సమంజసం కాదని... పీడీఎఫ్ నేతలు అభిప్రాయపడ్డారు. మండలి రద్దుపై పునరాలోచించుకోవాలని ఓ ప్రకటన విడుదల చేశారు.
pdf-condemn-govt-decession-on-ap-legislative-council