ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పులివెందుల ప్రజలే అమరావతిని రాజధానిగా కోరుతున్నారు' - అమరావతి రైతులు ఆందోళన

అమరావతిలో రాజధాని కల్పవృక్షం లాంటిదని ఏపీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. రాజధానిని మూడు ముక్కలు చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అవ్వదన్నారు. ప్రత్యేక హోదా, పెండింగ్​ ప్రాజెక్టుల పూర్తి, విభజన చట్టంలోని అంశాలు అమలు చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందన్నారు. రాజధానిగా అమరావతి కావాలని పులివెందుల ప్రజలే కోరుకుంటున్నారని తులసిరెడ్డి పేర్కొన్నారు.

ఏపీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి
ఏపీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి

By

Published : Jul 4, 2020, 6:25 PM IST

రాజధానిగా అమరావతి న్యాయమని చెప్పడానికి 10 కారణాలు ఉన్నాయని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి తెలిపారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పులివెందుల ప్రజలే కోరుకుంటున్నారన్నారు. రాజధాని ముడు ముక్కలు చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అవ్వదని అన్నారు. కేంద్రంతో పోరాడి ప్రత్యేకహోదా తెస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందన్న తులసిరెడ్డి... పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు.

విభజన చట్టంలోని అంశాలను అమలు చేస్తే అభివృద్ది వికేంద్రీకరణ అవుతుందన్నారు. అమరావతిలో రాజధాని కామధేనువు, కల్పవృక్షం లాంటిదన్నారు. ఒక రాజధానికి దిక్కులేదు గాని మూడు రాజధానులు నిర్మిస్తామని ఉత్తమ కుమారుడి ప్రగల్బాలు తగవని తులసిరెడ్డి ఎద్దేవాచేశారు.

ఇదీ చదవండి :రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదు: సుజనా చౌదరి

ABOUT THE AUTHOR

...view details