ఆంధ్రప్రదేశ్

andhra pradesh

PCC MAHESH: 'హుజూరాబాద్​ ఎన్నిక కోసం కాంగ్రెస్​కు ఐదుగురు అభ్యర్థులు'

By

Published : Aug 30, 2021, 6:48 PM IST

తెలంగాణ హుజూరాబాద్​ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్​ పార్టీకి ఐదుగురు అభ్యర్థులు అందుబాటులో ఉన్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ పేర్కొన్నారు. మిగతా పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చే అభ్యర్థిని బరిలో నిలుపుతామని స్పష్టం చేశారు.

huzurabad elections
huzurabad elections

హైదరాబాద్​ గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ ముఖ్య నేతలతో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్​ భేటీ అయ్యారు. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక, గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశ అనంతరం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​ మాట్లాడారు.

ఈ సందర్భంగా హుజూరాబాద్ అభ్యర్థి ఎంపిక, అక్కడ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు మహేశ్​కుమార్​ గౌడ్​ పేర్కొన్నారు. సానుకూల వాతావరణంలో చర్చ కొనసాగిందన్న ఆయన.. ఐదుగురు అభ్యర్థులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. మిగతా అభ్యర్థుల్లో గట్టి పోటీనిచ్చే అభ్యర్థిని ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎల్పీ నేత భట్టి, దామోదర రాజనర్సింహలు కలిసి స్థానిక సీనియర్ నాయకులతో చర్చించి సెప్టెంబర్ 10 నాటికి అభ్యర్థిపై నివేదిక ఇవ్వాలని మానిక్కం ఠాగూర్ సూచించినట్లు తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఖరీదైన ఎన్నికగా నిలవబోతుందన్న ఆయన.. తెరాస, భాజపాలు రెండూ తమకు రాజకీయ శత్రువులుగా వ్యాఖ్యానించారు.

వచ్చే నెల 17 లోపు రెండు దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మహేశ్​ పేర్కొన్నారు. ఈ రెండు సభలకు బయట నుంచి సీనియర్ నాయకులు హాజరవుతారని తెలిపారు. గజ్వేల్​లో సభ పెట్టాలా.. లేదా అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదన్న ఆయన.. వరంగల్ సభ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

RRR: 'సీఎం పర్యటనకు వెళ్లినప్పుడల్లా.. బొత్స అలాగే మాట్లాడతారు'

ABOUT THE AUTHOR

...view details