ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆ పార్టీ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయాలి' - Uttam Kumar fires on kcr news

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్​కుమార్​రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ తీరుపై మండిపడ్డారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసమే తెరాస అబద్ధపు హామీలు ఇస్తోందని ఆరోపించారు. ప్రజలు తెరాసను, ఆ పార్టీ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయాలని వ్యాఖ్యానించారు.

pcc-chief-uttam-kumar-reddy
పీసీసీ చీఫ్ ఉత్తమ్​కుమార్​రెడ్డి

By

Published : Nov 24, 2020, 4:50 PM IST

ఓట్ల కోసం తెరాస అబద్ధపు హామీలు ఇస్తోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్​ రెడ్డి మండిపడ్డారు. తెరాస హామీల పట్ల హైదరాబాద్‌ నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హుస్సేన్‌సాగర్ నీటిని కొబ్బరినీళ్లలా మారుస్తామన్నారు.. ఏమైందని ప్రశ్నించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు కడతామన్నారు.. ఏం చేశారని ధ్వజమెత్తారు.

సెలూన్లకు ఉచిత విద్యుత్ హామీని ఎన్నోసార్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఉచిత వై-ఫై సేవలు అందిస్తామని అన్నారు. అసలు అమలు చేయలేదు. లక్ష రెండు పడక గదుల ఇళ్లను ఇస్తామన్నారు.. ఒక్కటి కూడా ఇవ్వలేదు. నాలాల ఆధునీకరణ గురించి ఎన్నోసార్లు చెప్పారు.. ఏమీ చేయలేదు. తెరాసను, ఆ పార్టీ మేనిఫెస్టోను ప్రజలు చెత్తబుట్టలో వేయాలనిపీసీసీ చీఫ్ ఉత్తమ్​కుమార్​రెడ్డి పేర్కొన్నారు.

పీసీసీ చీఫ్ ఉత్తమ్​కుమార్​రెడ్డి

నిమ్స్ పరిస్థితి దిగజార్చి బస్తీ దవాఖానాల గురించి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు ఉత్తమ్​. ఇప్పటివరకు ఉచితంగా తాగునీరు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు కేసీఆర్ తాయిలాల వల వేస్తున్నారని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం.. తర్వాత మరిచిపోవడం తెరాసకు మామూలేనని వెల్లడించారు. తెరాస అసమర్థత వల్లే హైదరాబాద్ వరదల్లో మునిగిందని గుర్తు చేశారు. వరదల్లో మునిగిన ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మెట్రో రైలు తీసుకొచ్చింది కాంగ్రెస్సేనని తెలిపారు. పాతబస్తీ వరకు మెట్రో రైలును ఎందుకు తీసుకెళ్లలేకపోయారని ధ్వజమెత్తారు. 7 ఏళ్లలో కేవలం 36 వేల ఉద్యోగాలే ఇచ్చినట్లు మేనిఫెస్టోలో ఒప్పుకున్నారన్నారు ఉత్తమ్​.

ఇదీ చూడండి:

సూటిగా అడుగుతున్నా.. సుత్తిలేకుండా చెప్పండి : మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details