ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Revanth Reddy: 'తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మదే...' - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు

పోడు భూములను హరితహారం కింద గుంజుకున్నారని టీపీసీసీ చీఫ్​ రేవంత్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో జరిగిన దళిత, గిరిజన దండోరా సభలో రేవంత్​ ప్రసంగించారు.

Revanth Reddy: 'తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మదే...'
Revanth Reddy: 'తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మదే...'

By

Published : Sep 17, 2021, 10:47 PM IST

Revanth Reddy: 'తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మదే...'

కొండపోచమ్మ ప్రాజెక్టు కింద 14 గ్రామాలను నట్టేట ముంచారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. 14 గ్రామాల ప్రజలకు నిలువ నీడ లేకుండా చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియాదే అని చెప్పారు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. 12 శాతం ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవైనా ఇచ్చారా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్​ ఇంట్లో వాళ్లందరికీ పదవులు ఇచ్చారని దయ్యబట్టారు. పోడు భూములను హరితహారం కింద గుంజుకున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. పల్లెల్లో 4 వేలకు పైగా బడులు బంద్ చేశారని తెలిపారు. మైనార్టీల రిజర్వేషన్లు 12 శాతం చేస్తామని చెప్పి ఏడేళ్లు దాటిందని.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ తుంగలో తొక్కారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

ఇంద్రవెల్లిలో మొదటి సభ పెట్టినప్పుడు బిడ్డా మీరు గజ్వేల్​ రండి.. చూసుకుంటాం అన్నారు. ఆరోజే చెప్పాను గజ్వేల్​ గడ్డ మీద కదం తొక్కుతామని. ఒక్కరు కాదు.. లక్ష మంది సైనికులతో వస్తా అని చెప్పిన. ఈరోజు గజ్వేల్​ నుంచి 20 కిలోమీటర్ల వరకు ఇసుక వేస్తే రాలనంతగా.. తిరుపతి తిరునాళ్లలో.. యాదగిరిగుట్ట నరసింహస్వామి దగ్గర బ్రహ్మోత్సవాలు చేస్తే ఎట్ల జనం వస్తరో అట్ల వచ్చారు. లక్ష మంది కాదు రెండు లక్షలు మంది కదం తొక్కారు.

-రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఈ సభలో ఏర్పాటు చేసిన రేవంత్​ కటౌట్​ అందరి దృష్టిని ఆకర్షించింది. యముడి రూపంలో రేవంత్​ రెడ్డి భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.​

ఇదీ చదవండి:MODI BIRTHDAY: దేశ సంస్కృతిని కాపాడే పార్టీ భాజపానే: సోము వీర్రాజు

ABOUT THE AUTHOR

...view details