ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అరటి, పుచ్ఛ, కర్బూజ రైతులను తక్షణమే ఆదుకోండి' - పయ్యావుల కేశవ్​ వీడియో కాన్ఫరెన్స్​ తాజా సమాచారం

ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఆర్థిక మంత్రి బుగ్గనతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో పీఏసీ చైర్మన్​ పయ్యావుల కేశవ్​ పాల్గొన్నారు. ఉద్యాన, కలింగర రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా చాలా చోట్ల పెన్షన్ల పంపిణీ సరిగ్గా జరగలేదని, ప్రభుత్వ సాయం అందరికీ అందాలని మంత్రుల వద్ద ప్రస్తావించారు.

payyavula kesav video conference with deputy cm and finance minister
మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడుతున్న పయ్యావుల కేశవ్​

By

Published : Apr 7, 2020, 4:39 AM IST

అరటి, కర్బూజా, పుచ్చకాయ రైతులను ఆదుకోవాలని పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ కోరారు. ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన... 2-3 రోజుల్లో పంట కోతలు జరపకపోతే పూర్తిగా నష్టం వాటిల్లుతుందన్నారు. మరోవైపు... ప్రభుత్వం అందిస్తున్న వెయ్యి రూపాయల ఆర్థికసాయం ఇంకా చాలామందికి అందాల్సిన అవసరముందని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. వేసవిలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు

ABOUT THE AUTHOR

...view details