ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Payyavula released letter: 'ఆర్థిక తప్పిదాలపై కేంద్రానికైనా సమాధానం చెప్పండి' - tdp on financial condition of ap

ఏపీ ఆర్థిక శాఖకు కేంద్రం రాసిన మరో లేఖను తెదేపా సీనియర్‌ నేత, ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని లేఖతో స్పష్టమైందని పయ్యావుల అన్నారు. రాష్ట్రం చేసే ఆర్థిక తప్పిదాలపై కేంద్రానికైనా సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.

payyavula kesav
payyavula kesav

By

Published : Jul 10, 2021, 12:48 PM IST

Updated : Jul 10, 2021, 1:32 PM IST

ఏపీ ఆర్థిక శాఖకు కేంద్రం రాసిన లేఖను విడుదల చేసిన పయ్యావుల కేశవ్​
ఏపీ ఆర్థిక శాఖకు కేంద్రం రాసిన లేఖను విడుదల చేసిన పయ్యావుల కేశవ్​

ఏపీ ఆర్థికశాఖకు కేంద్రం రాసిన మరో లేఖను తెదేపా సీనియర్‌ నేత, ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రుణాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖ ఉంది. పరిధికి మించి అప్పులపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిందని.. రూ.17,923.94 కోట్లను పరిధికి మించి అప్పులు చేశారంటూ లేఖ రాసిందని పయ్యావుల కేశవ్​ అన్నారు.

రుణాలు, కేంద్ర అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ వివరణ కోరడంపై రాష్ట్ర ఆర్థిక శాఖ స్పందించాలన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని లేఖతో స్పష్టమైందని పయ్యావుల పేర్కొన్నారు. రాష్ట్రం చేసే ఆర్థిక తప్పిదాలపై కేంద్రానికైనా సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. గత నెల 30న కేంద్ర ఆర్థిక శాఖ ఏపీకి లేఖ రాసిందని పయ్యావుల కేశవ్‌ వెల్లడించారు.

అంతకుముందు...

రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ.41,043.18 కోట్ల ఖర్చుకు లెక్కాపత్రం లేదని, జమాఖర్చులు సరిగా లేవని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కి పయ్యావుల కేశవ్‌.. శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య అకౌంటెంట్‌ జనరల్‌ మే నెలలో రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌కి రాసిన లేఖను కేశవ్‌ గవర్నర్‌కు అందజేశారు. గవర్నర్‌ తక్షణం జోక్యం చేసుకోవాలని, 2019-20, 2020-21 సంవత్సరాల ఆర్థికశాఖ వ్యవహారాలపై కాగ్‌తో ఆడిట్‌ చేయించాలని కోరారు.

ఇదీ చదవండి:

రూ.41 వేల కోట్ల చెల్లింపులకు ఎలాంటి లెక్కలు లేవు: పయ్యావుల

Last Updated : Jul 10, 2021, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details