రాజధాని రైతులకు కౌలు చెల్లించండి: కన్నా - cm jagan
ముఖ్యమంత్రి జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లేఖ రాశారు. రాజధాని రైతులకు వెంటనే కౌలు చెల్లించాలని కోరారు.
రాజధాని రైతులకు కౌలు చెల్లించండి: కన్నా
సీఎం జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా బహిరంగ లేఖ రాశారు. రాజధాని రైతులకు కౌలు చెల్లించకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. కౌలు డబ్బులు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలల్లో చెల్లించాల్సిన కౌలు ఇంకా ఇవ్వలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు వెంటనే కౌలు మొత్తం చెల్లించాలని లేఖలో కోరారు.