హైకోర్టు ఆదేశాలతో రూ.5 లక్షల్లోపు విలువైన ఉపాధి పనుల బిల్లుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి. సీఎఫ్‌ఎంఎస్ విధానంలో సోమవారం రూ.25 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని అధికారులు తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో మెటీరియల్ కాంపోనెంట్ కింద 2018-19లో చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యంపై పలువురు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సోమవారంలోగా బిల్లులు చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం పలు గ్రామ పంచాయతీల ఖాతాలకు నిధులు జమయ్యాయని తెలుస్తోంది. హైకోర్టులో కేసులు వేసిన వారికే బిల్లులు చెల్లిస్తున్నారా? పెండింగ్ బిల్లులన్నీ పరిష్కరిస్తున్నారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
హైకోర్టు ఆదేశాలతో ఉపాధి బిల్లుల చెల్లింపులు - ఉపాది హామీ నిధులు ఏపీ
రూ.5 లక్షల లోపు ఉపాధి పనుల బిల్లుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి. సోమవారంలోగా బిల్లులు చెల్లించాలని హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో బిల్లుల చెల్లింపు ప్రారంభమైంది.

pay ment of mgnregs with the orders of highcourt