ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నూతన గవర్నర్లకు జనసేనాని పవన్ శుభాకాంక్షలు - himachal

తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ నూతన గవర్నర్లు తమిళిసై సౌందర్ రాజన్, బండారు దత్తాత్రేయకు జనసేన అధినేత శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్ర స్థాయి సమస్యలపై దత్తాత్రేయకు పూర్తి అవగాహనుందని... తమిళసై ప్రజా పోరాట ఉద్యమాల్లో ముందుడేవారని పవన్ అన్నారు.

నూతన గవర్నర్లకు జనసేనాని పవన్ శుభాకాంక్షలు

By

Published : Sep 1, 2019, 8:51 PM IST

తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ కు నూతన గవర్నర్ లుగా నియమితులైన తమిళిసై సౌందర్ రాజన్, బండారు దత్తాత్రేయకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. వృత్తిరీత్యా వైద్యురాలైన తమిళిసై..మహిళా హక్కుల కోసం చేపట్టే ఉద్యమాల్లో, ప్రజల పోరాటాల్లో ముందుంటారన్నారు. వారి సామాజిక ధృక్కోణం తెలంగాణ అభివృద్ధికి దోహదం చేస్తుందని ఆశించారు. క్షేత్ర స్థాయి సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న దత్తాత్రేయ కార్మికులు, పేదల సంక్షేమం గురించి తన ఆలోచనలు పంచుకునేవారన్నారు. హిమాచల్ గవర్నర్ గా ఆ పదవికి ఆయన వన్నె తీసుకువస్తారన్న విశ్వాసం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details