ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఉత్తరాంధ్ర రైతులకు అమరావతి పరిస్థితి రాకుండా చూడాలి' - విశాఖలో భూసమీకరణ వార్తలు

అమరావతి రైతుల పరిస్థితి... ఉత్తరాంధ్ర రైతులకు రాకుండా చూడాలని జనసేన ఉత్తరాంధ్ర నేతలతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విశాఖలో భూసమీకరణ తీరుపై నేతలతో టెలీకాన్ఫరెన్స్ చేశారు.

pawan teleconfernce with north andhra leaders
pawan teleconfernce with north andhra leaders

By

Published : Feb 5, 2020, 10:06 PM IST

విశాఖలో భూసమీకరణపై జనసేన ఉత్తరాంధ్ర నేతలతో పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ టెలీకాన్ఫరెన్స్‌ చేశారు. అమరావతి రైతుల పరిస్థితి.... ఉత్తరాంధ్ర రైతులకు రాకుండా చూడాలని చెప్పారు. అసైన్డ్‌ భూమి తీసుకునేందుకు సిద్ధమై పేద రైతులకు అన్యాయం చేస్తున్నారన్న పవన్‌.. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ రైతులు ఎక్కువగా నష్టపోతారని చెప్పారు. తమనూ రోడ్డుపైకి తీసుకొస్తారనే భయం ఉత్తరాంధ్ర రైతుల్లో ఉందన్న ఆయన.. రైతులకు జనసేన అండగా నిలుస్తుందని చెప్పారు. భూసమీకరణ గ్రామసభలను జనసేన నేతలు పరిశీలించాలని పేర్కొన్నారు. విశాఖలో భూసమీకరణ ముసుగులో జరిగే లావాదేవీలను గుర్తించాలని.. పార్టీ నేతలకు టెలీకాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు.

ABOUT THE AUTHOR

...view details