ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే ఆ ఉత్తర్వులు: పవన్ - ఇళ్ల స్థలాలపై పవన్ వ్యాఖ్యలు న్యూస్

రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూములను ఇళ్ల స్థలాల కోసం ఇవ్వడం సరికాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. వివాదాలకు తావు లేని భూములనే ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని ప్రకటనలో డిమాండ్ చేశారు.

వివాదాల్లేని భూములనే ఇళ్ల స్థలాలకివ్వాలి: పవన్
వివాదాల్లేని భూములనే ఇళ్ల స్థలాలకివ్వాలి: పవన్

By

Published : Feb 26, 2020, 5:42 PM IST

Updated : Feb 26, 2020, 6:05 PM IST

వివాదాల్లేని భూములనే ఇళ్ల స్థలాలకివ్వాలి: పవన్

ఇళ్లు లేని పేదలకు స్థలం కేటాయించడాన్ని ఎవరూ తప్పు పట్టరని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వివాదాలు లేని భూములనే ఇవ్వాలని సూచించారు. నిర్దేశిత అవసరాల కోసం సమీకరించిన భూములను పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వివాదాలకు ఆస్కారం ఇస్తుందన్నారు. ఓ వైపు రాజధాని రైతులు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు ఆ భూములకు పట్టాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయటం సరికాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లోనూ స్థలాల కోసం ఇచ్చిన భూముల్లోనూ వివాదాల్లో ఉన్నాయని చెప్పారు. అసైన్డ్ భూములు, విద్యా సంస్థల భూములు, శ్మశాన భూములను ఇళ్ల స్థలాల కోసం ఇవ్వడం చూస్తుంటే.. పథకంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

అమరావతి కోసం సామాన్యుడి అసామాన్య పోరాటం

Last Updated : Feb 26, 2020, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details