అసైన్డ్ రైతుల సొసైటీ అధ్యక్షుడు పులి చినలాజర్ మృతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లంకభూములపై పేదలు, దళిత రైతుల గొంతు వినిపించారని లాజర్ను కొనియాడారు. 2018లో లాజర్ స్వగ్రామం ఉద్దండరాయుపాలెంలో ఉగాది వేడుక జరుపుకొన్న విషయాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు.
రాజధాని అమరావతిలోనే ఉండాలని చినలాజర్ గట్టిగా పోరాడారని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 300 రోజులకు చేరిన ప్రస్తుత ఉద్యమాన్ని రాష్ట్రస్థాయిలో బలంగా చేసి అనుకున్నది సాధించినప్పుడు లాజర్కు సరైన నివాళి అని పవన్ వ్యాఖ్యానించారు.