రాజధాని ప్రాంత రైతుల ఆందోళనకు మద్దతిచ్చేందుకు... నేడు అమరావతి గ్రామాల్లో పవన్ పర్యటిస్తారని జనసేన గుంటూరు పార్లమెంట్ ఇంఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఉదయం 8 గంటలకు ఎర్రబాలెంలో పర్యటన ప్రారంభమై... మందడం, వెలగపూడి, తుళ్లూరులో సభల అనంతరం ముగుస్తుందని వివరించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఆయన... మీడియాతో మాట్లాడారు.
నేడు రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన - అమరావతిలో పవన్ పర్యటన
రాజధాని విషయంలో వైకాపా సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ... అమరావతి ప్రాంతంలో కొన్నిరోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వారిలో ధైర్యం నింపేందుకు పవన్ కల్యాణ్ మంగళవారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు.
అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పవన్ తెలుసుకుంటున్నారని వివరించారు. అమరావతిలో అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అదే సమయంలో విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్పైనా విచారణ జరపాలన్నారు. సంక్షేమ పథకాలు అందక వైకాపాను ప్రజలు చీదరించుకుంటున్న సమయంలో... 3 రాజధానుల అంశం తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. రాజధాని అంశంపై నిన్నటి సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఇదీ చదవండి:'సీఎం ఆదేశాల మేరకే అన్నీ జరుగుతున్నాయి'