ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజధాని మార్పు అంటే.. ఆఫీసును తరలించడం కాదు' - రాజధానిపై సీఎం వ్యాఖ్యలపై పవన్ ట్వీట్స్ వార్తలు

రాజధాని మార్పంటే ఆఫీసును ఒకచోట నుంచి మరోచోటుకు మార్చడం కాదనీ.. కొన్నివేల జీవితాలను బలవంతంగా తరలించడమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని అంశంపై సీఎం వ్యూహం ప్రకారమే మాట్లాడుతున్నారని ఆరోపించారు.

pawan kalyan tweets on cm jagan comments on capital
పవన్ కల్యాణ్

By

Published : Dec 18, 2019, 9:45 AM IST

రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ వ్యూహం ప్రకారమే అసెంబ్లీలో ప్రకటన చేశారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. విశాఖ ప్రాంతంలో భూములను ముందుగానే హస్తగతం చేసుకుంటూ వచ్చారని.. వివాదాస్పద భూముల విషయంలో పంచాయతీలు మొదలుపెట్టారని విమర్శించారు. భూముల విషయంలో కఠినంగా వ్యవహరించినందునే అక్కడి జాయింట్ కలెక్టర్ శివశంకర్‌ను తప్పించి.. తమకు అనుకూలమైన వేణుగోపాల్‌రెడ్డిని నియమించుకున్నారని ఆరోపించారు. వారం క్రితమే ఈ హడావిడి బదిలీ జరిగినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక అక్కడ పులివెందుల పంచాయతీలు మొదలవుతాయని విమర్శించారు.

పవన్ కల్యాణ్

వారి బాధ్యత ఎవరు తీసుకుంటారు

అమరావతిలో పరిపాలన ఇంకా కుదురుకోలేదన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబాలు రాజధాని ప్రాంతానికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారని.. వారి పిల్లలు ఇక్కడి విద్యాసంస్థల్లో చేరారని వివరించారు. ఇపుడు వారిని మరోచోటుకి వెళ్లిపోమంటే ఎలా అని ప్రశ్నించారు. రాజధాని మార్పు అంటే ఆఫీసును ఒకచోట నుంచి మరో చోటకు మార్చడం కాదనీ.. కొన్ని వేల జీవితాలను బలవంతంగా తరలించడమేనని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల వ్యయప్రయాసలకు బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్

ఇవీ చదవండి..

3 రాజధానుల ప్రస్తావనపై... పవన్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details