ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చలో అంతర్వేదికి మా మద్దతు ఉంటుంది: పవన్

మిత్ర పక్షం భారతీయ జనతా పార్టీ నాయకత్వం శుక్రవారం ‘చలో అంతర్వేది’ కార్యక్రమానికి పిలుపునిచ్చిందని పవన్ కల్యాణ్ తెలిపారు. భావోద్వేగాలను, మనోభావాలను కించపరచడంతో ప్రజలే బయటకు వచ్చినప్పుడు... వారితో అనుసంధానం కావాలని నిర్ణయించామని తెలిపారు. ఇందుకు జనసేన పార్టీ మద్దతు తెలియచేస్తుందని స్పష్టం చేశారు.

Pawan Kalyan support to BJP's Chalo Antarvedi program
పవన్

By

Published : Sep 10, 2020, 5:30 PM IST

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ పవిత్ర రథం దగ్ధం, అంతకుముందు పిఠాపురం, కొండబిట్రగుంటలో జరిగిన ఈ తరహా సంఘటనల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అందుకే భక్తులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు. తమ మిత్రపక్షం భాజపా శుక్రవారం చలో అంతర్వేది కార్యక్రమానికి పిలుపునిచ్చిందని తెలిపారు. కరోనా విపత్తు సమయంలో దీన్ని ఎంతవరకూ ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై చర్చించామని తెలిపారు.

భావోద్వేగాలు, మనోభావాలు కించపరిచారనే ప్రజలు బయటకు వచ్చారని... అలాంటప్పుడు వారితో అనుసంధానం కావాలని నిర్ణయించినట్టు పవన్ వివరించారు. ఇందుకు జనసేన పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొనాలని పార్టీ శ్రేణులను పవన్ కోరారు. ప్రజల మనసులు గాయపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉందని పేర్కొన్నారు. ఎవరూ భావోద్వేగానికి గురికాకుండా నిరసన తెలియజేయాలని సూచించారు.

ఇదీ చదవండీ... మూడు రాజధానులు తప్పు లేదు.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్

ABOUT THE AUTHOR

...view details