'భాష, సంస్కృతికీ నష్టం కలిగిస్తే... దేశ సమగ్రతకు ముప్పే' - latest news on telugu langauage
భాష, సంస్కృతికీ నష్టం కలిగిస్తే... దేశ సమగ్రతకు ముప్పువాటిల్లుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ పార్టీ విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో పవన్ కోరారు
భారతదేశపు మూలాలైన భాష, సంస్కృతులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. మన ప్రాంతీయ నాయకులకు సంస్కృతి, భాషలపై సంపూర్ణ అవగాహన ఉండాలని ఆ పార్టీ విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో పవన్ కోరారు. తెలిసీ తెలియకుండా భాషకు, సంస్కృతికి నష్టం కలిగిస్తే... దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశాన్ని సంస్కృతిపరంగా విడదీయడానికి ఒక తాత్త్విక భూమికను తయారు చేస్తున్నారన్న విశ్రాంత డీజీపీ అరవిందరావు వ్యాఖ్యలపై... ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మాతృభాష మూలాలను రేపటి తరానికి తెలియకుండా చేయడం ద్వారా... దేశంలో భాష, సంస్కృతుల విశిష్టతకి, సనాతన ధర్మ పవిత్రతకి నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'జగన్ గారూ... మీ మంత్రులతో ఆంగ్లం మాట్లాడించండి'