ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంద్రకీలాద్రి ఔట్ సోర్సింగ్​ ఉద్యోగుల్లో విభేదాలు సృష్టిస్తారా?: పవన్

ఇంద్రకీలాద్రిపై పని చేసే ఔట్​సోర్సింగ్ ఉద్యోగుల్లో కొందరికి మాత్రమే పని కల్పిస్తూ... మరికొందరికి పని లేకుండా చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ తరహా చర్యలతో ఉద్యోగుల్లో విభేదాలు సృష్టిస్తారా అని ప్రశ్నించారు.

pawan kalyan
pawan kalyan

By

Published : Jul 6, 2020, 7:04 PM IST

ఇంద్రకీలాద్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో కొందరికి పని లేకుండా చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. పదేళ్లుగా పని చేస్తున్న వారిలో కొందరికే పని కల్పిస్తున్నారని తెలిపారు. కరోనా వల్ల దేశ వ్యాప్తంగా ఆలయాలు మూసివేశారని.. ఈ కారణంగా ఆలయంలో పని చేసే కొందరినీ విధులకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

జనసేన ప్రకటన

చిరుద్యోగుల్లో తారతమ్యాలు ఎందుకు సృష్టిస్తున్నారో దేవాదాయశాఖ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఇప్పుడు విధులకు కూడా పిలవడం లేదంటూ ఉద్యోగులు వాపోతున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి జీతభత్యాలు అందని వారందరికీ చెల్లించాలని కోరుతూ ప్రకటన విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details