అమరావతి రైతులు చేస్తున్న దీక్షకు పవన్‌కల్యాణ్ సంఘీభావం తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు రైతులు 14వ రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. అటుగా వెళ్తున్న పవన్ కల్యాణ్ వాహనాన్ని రైతులు ఆపారు. రాజధాని అమరావతిలోనే కొనసాగేలా.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. వారి వినతిపై అనుకూలంగా స్పందించిన పవన్... వారికి మద్దతిస్తున్నట్లు తెలిపారు.
అమరావతి రైతుల దీక్షకు పవన్ సంఘీభావం - pawan on amaravathi
అమరావతి రైతుల దీక్షకు జనసేనాని మద్దతిచ్చారు. గుంటూరు జిల్లా నవులూరు రైతులు... ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పవన్‌ను కోరారు.
అమరావతి రైతుల దీక్షకు పవన్ సంఘీభావం