రాజధాని విషయమై ప్రజల్లో గందరగోళం నెలకొందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ పరిస్థితి సర్వత్రా శ్రేయస్కరం కాదని పవన్ అభిప్రాయపడ్డారు. కమిటీ నివేదికపై మంత్రివర్గంలో చర్చిస్తామంటున్నారని... ఆ తర్వాత జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచుతామని జనసేనాని తెలిపారు. అభివృద్ధి అంటే నాలుగు ప్రభుత్వ కార్యాలయాలో...? 4 భవనాలో..? అని భావించట్లేదన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, రాజకీయ జవాబుదారీతనం కోరుకుంటున్నామని పవన్ తెలిపారు
'రాజధానిపై గందరగోళం శ్రేయస్కరం కాదు' - మూడు రాజధానులపై పవన్ కల్యాణ్
రాజధానిపై గందరగోళ పరిస్థితి శ్రేయస్కరం కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికపై రాష్ట్ర మంత్రి వర్గ చర్చ అనంతరం తమ నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచుతామని జనసేనాని స్పష్టం చేశారు.
'రాజధానిపై గందరగోళం శ్రేయస్కరం కాదు'