గంగా ప్రక్షాళనకు నేను సైతం అంటున్న పవన్ - హరిద్వార కు జనసేనాని నదీ జలాల పరిరక్షణ
హరిద్వార్ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్... పవిత్ర గంగా హారతిలో పాల్గొన్నారు. గంగా ప్రక్షాళనకు మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు.
![గంగా ప్రక్షాళనకు నేను సైతం అంటున్న పవన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4726571-247-4726571-1570854005025.jpg)
pawan-kalyan
హరిద్వార్ పవిత్ర గంగా హారతిలో పాల్గొన్న పవన్
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఈ ఉదయం జరిగిన పవిత్ర గంగా హారతిలో పాల్గొన్నారు. గంగా ప్రక్షాళనకు ఆయన మద్దతు ప్రకటించారు. ప్రజల నమ్మకాలు, విశ్వాసాలు, సంస్కృతిని పరిరక్షించేందుకు గంగానది కాలుష్యానికి గురికాకుండా తీసుకోవాల్సిన అంశాలపై స్థానికులతో చర్చించారు. హారతిని ఆద్యంతం తిలకించారు. గంగా నది ప్రక్షాళన కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్దగా మద్దతు రావడం లేదని... పవన్ ఆ లోటు భర్తీ చేయాలని మాత్రిసదన్ ఆశ్రమ ప్రతినిధులు కోరారు.
Last Updated : Oct 12, 2019, 1:24 PM IST