ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పదో తరగతి, ఇంటర్​ పరీక్షలు రద్దు చేయాలి: పవన్​ - corona cases in ap

రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్​ పరీక్షలు రద్దు చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ డిమాండ్​ చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో పరీక్షల నిర్వహణ సరికాదని అన్నారు.

pawan kalyan demands to cancel 10 th class exams
pawan kalyan demands to cancel 10 th class exams

By

Published : Apr 20, 2021, 12:40 PM IST

కరోనా ఉద్ధృతి సమయంలో పదో తరగతి, ఇంటర్​ పరీక్షల నిర్వహణ సరికాదని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులనే కాదు వారి కుటుంబాలను కరోనా ముప్పులోకి నెట్టేస్తున్నారని అన్నారు. తక్షణమే పరీక్షలు రద్దుచేసి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

పరీక్షల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటున్న తీరు హాస్యాస్పదంగా ఉందని పవన్​కల్యాణ్​ అన్నారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోతే మిలట్రీ ఉద్యోగాలు కోల్పోతారనడం అర్థరహితమన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఎస్​ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేసిందన్నారు.

ఇదీ చదవండి:'రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది'

ABOUT THE AUTHOR

...view details