Pawan Kalyan on ambulance mafia: ప్రభుత్వం చేపట్టబోయే గర్జన కార్యక్రమంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. గర్జన కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆస్పత్రిలో మృతి చెందిన వ్యక్తిని తరలించేందుకు వాహనం సమకూర్చలేక భుజాన వేసుకుని బైక్‌పై తీసుకెళ్లేలా చేసినందుకా... అని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నందుకా అని మండిపడ్డారు.
"దేనికి గర్జన ?.. అంబులెన్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నందుకా?" - వైకాపాపై పవన్ కల్యాణ్ ట్విట్టర్లో విమర్శలు
Pawan Kalyan on ambulance mafia: వైకాపాపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పిస్తున్నారు. అంబులెన్స్ మాఫియాను గుర్తు చేస్తూ వైకాపాపై విరుచుకుపడ్డారు. దేనికి గర్జన?.. అంబులెన్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నందుకా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్‌కల్యాణ్
"దేనికి గర్జన?.. అంబులెన్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నందుకా?. ఆస్పత్రిలో మృతి చెందితే తరలించేందుకు వాహనం సమకూర్చలేనందుకా?. కన్నుమూసిన బిడ్డను భుజాన వేసుకుని బైక్‌పై తీసుకెళ్లేలా చేసినందుకా?." -జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఇవీ చదవండి: