పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అభినందనలు తెలిపారు. తెలుగమ్మాయి పీవీ. సింధు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికకావడం హర్షణీయమన్నారు. క్రీడారంగంలో తెలుగువారి సామర్థ్యాన్ని సింధు చాటుతోందని కొనియాడారు. రంగస్థలంపై పౌరాణిక నాటకాలకు యడ్ల గోపాలరావు జీవం పోశారని.. తోలు బొమ్మలు చేసే హస్తకళా ప్రవీణుడు దలవాయి చలపతిరావు అని కితాబిచ్చారు. సంస్కృత కవి శ్రీశ్రీ భాష్యం విజయసారథికి తగిన గుర్తింపు లభించిందన్నారు. సేంద్రియ వ్యవసాయంలో చింతల వెంకటరెడ్డికి గుర్తింపురావడం హర్షణీయమని కొనియాడారు.
తెలుగు 'పద్మ' గ్రహీతలకు జనసేనాని అభినందనలు - పద్మ గ్రహీతలకు పవన్ కల్యాణ్ అభినందనలు
పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అభినందనలు తెలిపారు. తమ తమ రంగాల్లో వారు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు.
పద్మ గ్రహీతలకు పవన్ కల్యాణ్ అభినందనలు