ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 16, 2019, 2:25 PM IST

ETV Bharat / city

'పింఛన్​ పథకం అమలులో ప్రభుత్వం మాట తప్పుతోంది'

వైఎస్ఆర్ పింఛన్​ పథకం అమలులో ప్రభుత్వం మాట తప్పుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విటర్​ వేదికగా మండిపడ్డారు.

pawan kalyan comments oon ysr pension scheme
వైఎస్ఆర్ పింఛన్​ పథకంపై పవన్​

వైఎస్ఆర్ పింఛన్​ పథకం అమలులో ప్రభుత్వం మాట తప్పుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్​ విమర్శించారు. వృద్ధాప్య పింఛన్​ పొందేందుకు వయస్సు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను పవన్ కల్యాణ్​ సామాజిక మాధ్యమాల్లో పొస్ట్ చేశారు. వయస్సు అర్హత తగ్గించినందున మరో 10లక్షల మంది పింఛన్​కు అర్హత సాధించారని... ప్రభుత్వం కొత్తగా ఒక్కరికీ కూడా పింఛన్​ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

పింఛన్​ మొత్తాన్ని 2వేల నుంచి 3వేలకు పెంచుతామని ఎన్నికల ముందు చెప్పి... అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 2250కి మాత్రమే పెంచారని గుర్తు చేశారు. వైకాపా సర్కారు అంచెలంచలుగా మాట తప్పుతోందని, మోసం చేస్తోందని అనుకోవాలా అంటూ నిలదీశారు.

వైఎస్ఆర్ పింఛన్​ పథకంపై పవన్​
వైఎస్ఆర్ పింఛన్​ పథకంపై పవన్​

ABOUT THE AUTHOR

...view details