ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్రమ కట్టడాలు తొలగిస్తే మంచి ఫలితాలు: పవన్ కల్యాణ్ - జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా వార్తలు

నదులు, చెరువులు, కుంటల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగిస్తే మంచి ఫలితాలు వస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఉంటుందని అభిప్రాయపడ్డారు.

pawan kalyan
pawan kalyan

By

Published : Oct 23, 2020, 4:55 PM IST

ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు వ్యవస్థలను బలోపేతం చేయాలే తప్ప తూట్లు పొడిచి వెళ్తే అనేక సమస్యలు తలెత్తుతాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జలవనరులను పరిరక్షించే జీవో 111కు తూట్లు పొడిచే ప్రయత్నాల వల్లే భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు అని ఆయన జనసేన సోషల్‌ మీడియా ప్రతినిధుల ముఖాముఖిలో తెలిపారు.

భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత చాలా పెరుగుతుందని పవన్ అన్నారు. నదులు, చెరువులు, కుంటలను ఆక్రమించి అమ్మేశారని- ఈ విధానాలను నిలువరించి అక్రమ కట్టడాలు తీసేస్తే ఫలితాలు ఉంటాయన్నారు. చెరువుల దురాక్రమణపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే నేతలు... అధికారంలోకి రాగనే సన్నాయినొక్కులు నొక్కుతున్నారన్నారు. అధికారమే పరమావధిగా కాకుండా సామాజిక మార్పు, పాలసీలపై బలంగా నిలబడాలనే ఆలోచన రాజకీయ పార్టీలలో ఉండాలని అభిప్రాయపడ్డారు. దసరా సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్ని రోజులుగా తాను దీక్షలో ఉన్నానని... కరోనా మహమ్మారి, విపత్తులు, కష్టాల నుంచి అమ్మవారు అందరినీ కాపాడాలని కోరుకుంటున్నానన్నారు.

111జీవోపై దృష్టి సారించండి....

తెలంగాణ ప్రభుత్వం 111 జీవో పై ప్రత్యేక దృషి సారించాలని పవన్ కల్యాణ్ కోరారు. జలవనరులను పరిరక్షించే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన ఈ జోవోకు తూట్లు పొడిచారని అన్నారు. ఇప్పటికైనా 111 జీవోను సమర్ధవంతంగా అమలుచేయాలని కోరారు.

ఇదీ చదవండి

'కరోనా తిరగబెట్టొచ్చు అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేం'

ABOUT THE AUTHOR

...view details