PAWAN KALYAN:ప్రజల సంపద, మాన, ప్రాణాల భక్షకులుగా పాలకులు మారి, అవినీతి, ఆశ్రిత పక్షపాతంలో కూరుకుపోయిన నాడు.. అలాంటి ప్రభుత్వాలను కూకటివేళ్లతో పెకిలించే వీరులు ఉద్భవిస్తారని చెప్పేందుకు అల్లూరి సీతారామరాజే నిలువెత్తు తార్కాణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘అణచివేతలో ఉద్భవించిన విప్లవాగ్ని అల్లూరి. ప్రకృతి ఒడిలో జీవనం సాగించే గిరిపుత్రులకు బతుకు పోరాటం నేర్పించి, ఆ పోరాటంలోనే అసువులు బాసిన అల్లూరి 125వ జయంతి సందర్భంగా నమస్సుమాంజలి. సీతారామరాజు తెలుగు గడ్డపై జన్మించి.. గోదావరి సవ్వళ్లతో ఎదిగారు. గోదావరికి ఉన్నంత గాంభీర్యం, లోతైన ఆలోచనతో కుటుంబంవైపు కాకుండా ప్రజలవైపు నడిచారు. 27 ఏళ్లకే పోరాటంలో అసువులు బాసి.. దేశ స్వాత్రంత్య ఉద్యమానికి దివిటీగా మారారు’ అని పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.
'అవినీతిని పెకిలించే వీరులు వస్తారు.. అల్లూరే అందుకు తార్కాణం': పవన్ - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
PAWAN KALYAN: అవినీతి, ఆశ్రిత పక్షపాతంలో కూరుకుపోయిన ప్రభుత్వాలను కూకటివేళ్లతో పెకిలించే వీరులు ఉద్భవిస్తారని చెప్పేందుకు అల్లూరే నిలువెత్తు నిదర్శమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరికి ఉన్నంత గాంభీర్యం, లోతైన ఆలోచనతో కుటుంబంవైపు కాకుండా ప్రజలవైపు నడిచారు. 27 ఏళ్లకే పోరాటంలో అసువులు బాసి.. దేశ స్వాత్రంత్య ఉద్యమానికి దివిటీగా మారారు’ అని పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.
PAWAN KALYAN