విభజన చట్టం ప్రకారం రాజధాని విషయంలో కేంద్రానికి బాధ్యత ఉందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. పాత్రికేయులతో ఇష్టాగోష్ఠిలో పాల్గొన్న ఆయన.. రాజధాని తరలింపు విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాజధాని విషయంలో తమ వైఖరేంటో భాజపా, కాంగ్రెస్ పార్టీలు స్పష్టం చేయాలని కోరారు. భూములిచ్చిన రైతులతో చర్చించాకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం జరగకూడదని ఉద్ఘాటించారు.
'అమరావతి విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి' - రాష్ట్ర రాజధానిపై పవన్ వ్యాఖ్యలు
అమరావతి విషయంలో కేంద్రప్రభుత్వం కల్పించుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. రాజధానిపై భాజపా, కాంగ్రెస్ పార్టీల వైఖరేంటో స్పష్టం చేయాలని కోరారు.
'అమరావతి విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి'