గుజరాత్లో చిక్కుకుపోయిన నాలుగువేల మంది శ్రీకాకుళం మత్య్సకారులను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేలాది మంది మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..వారి బాధలను వినాలని కోరారు. కనీసం సంబంధిత జిల్లా మంత్రులు కానీ ఉన్నతాధికారులను గుజరాత్‌కు పంపించి..వారికి భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనుకూల పరిస్థితులుంటే రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అంటూ ట్వీట్ చేశారు.
'గుజరాత్లో చిక్కుకుపోయిన మత్స్యకారులకు భరోసా ఇవ్వండి' - andhrapradesh lock down
గుజరాత్లో చిక్కుకుపోయిన శ్రీకాకుళం మత్స్యకారులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
pawan kalyan