ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నిత్యావసరాల కొరత లేదన్న భరోసా కల్పించండి' - pawan kalyan appeal to cm jagan over state boarders issue

ఆంధ్రా - తెలంగాణ సరిహద్దుల్లో ఇబ్బంది పడుతున్న విద్యార్థులను స్వస్థలాలకు చేరేలా ఏర్పాట్లు చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. నిత్యావసరాల విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా కోరారు.

pawan kalyan appeal to cm jagan over state boarders issue over corona affect
pawan kalyan appeal to cm jagan over state boarders issue over corona affect

By

Published : Mar 26, 2020, 4:58 PM IST

పవన్ ట్వీట్

కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్​కు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఏపీ బయల్దేరిన విద్యార్థులు సరిహద్దుల్లో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల అధికారులు ముందే చర్చించుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల బాధను అర్థం చేసుకుని ప్రభుత్వం వారిని స్వస్థలాలకు చేరేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.

వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఎన్ 95 మాస్కులు అందడం లేదన్న పవన్... అనుమానితుల శాంపిల్స్ పరీక్షించే సిబ్బంది, వైద్యులను పట్టించుకోవాలని సూచించారు. నిత్యావసరాల కోసం రైతు బజార్లు, కిరాణా దుకాణాల దగ్గర జనం క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. ఆ విషయంలో సరుకుల కొరత లేదన్న భరోసాను ప్రభుత్వం కల్పించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details